క్రైమ్/లీగల్

బాలింతపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 31: బిడ్డకు జన్మనిచ్చి తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సెంచూరి ఆసుపత్రికి గర్భవతి అయిన ఓ మహిళ గత 22న ప్రసవం కోసం సెంచూరి ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల అనంతరం 25వ తేదీన బిడ్డకు జన్ననిచ్చింది. ప్రసవ సయయంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో సదరు మహిళను ఐసీయూలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించే 50ఏళ్ల అచ్యుతరావు అసభ్యంగా వ్యవహరించాడు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న విషయాన్ని చెప్పేందుకు సైతం అవకాశం లేకుండా పోయింది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో శనివారం సదరు వార్డు బాయ్‌ను గుర్తించిన వారు చితక బాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.