క్రైమ్/లీగల్

భార్యను హతమార్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఆగస్టు 31: కట్టుకున్న భార్యను రోకలి బండతో తలపై మోది హతమార్చిన కసాయి భర్త వైనమిది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామ్‌నగర్‌లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు గ్రామానికి చెందిన శామ్యూల్ అశ్వని (28) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవరుగా పనిచేస్తున్న శామ్యూల్ అశ్వనితో గత రాత్రి గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా భార్య తలుపు తీసింది. కోపంతో ఉన్న భర్త శామ్యూల్ ఇంటిలోకి రాగానే రోకలి బండతో భార్య అశ్వనిని తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్యకు ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు భావిస్తున్నారు. భర్త శామ్యూల్ తన భార్యకు సంబంధించిన ఫోటోలతో సహా పోలీసులకు లొంగిపోయాడు. పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.