క్రైమ్/లీగల్

మన్యంలోని ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, ఆగస్టు 31: విశాఖపట్నం జిల్లా, జి.మాడుగుల మండలంలోని కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏసీబీ అధికారులు అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన ఈ తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పాఠశాలలో లోపాలను గుర్తించి, రికార్డులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు గణేష్, లక్ష్మణామూర్తిలు విలేఖరులతో మాట్లాడుతూ పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థులు లేకపోయినా హాజరు నమోదు చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. 619 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు జ్ఞానభూమి ఫోర్టల్‌లో నమోదు చేసిన ఉపాధ్యాయులు 501 మంది విద్యార్థులు హాజరు అయినట్టు చూపిస్తున్నారని, వాస్తవంగా శుక్రవారం, శనివారం పాఠశాలలో కేవలం 321 మంది మాత్రమే ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. లేని విద్యార్థుల హాజరు నమోదు చేసుకుని ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. పాఠశాల పర్యావేక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్.ఎం. ప్రసాద్‌రావు, ఏటీడబ్యూవో క్రాంతి కుమార్‌లతోపాటు విద్యార్థులకు సరిగా భోజనం పెట్టకుండా, ఆశ్రమ రికార్డులు సరిగా నిర్వహించకుండా వ్యవహరించిన డిప్యూటీ వార్డెన్ మత్స్యరాజులపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్లు గణేష్, లక్ష్మణమూర్తిలు తెలిపారు.