క్రైమ్/లీగల్

‘ఏడుకొండలపై ఏసు మందిరాలు’ ప్రచారంపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 31: కొద్దిరోజుల క్రితం ఏడుకొండలపై ఏసు మందిరాలు అని సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ కేసు కింద కేసు నమోదు చేశారు. అణువణువునా హిందుత్వం అనే గ్రూపు నుండి అరుణ్ ఈ తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేశారని నిర్ధారించి సైబర్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అరుణ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఫోటోలు కరకంబాడి ప్రాంతంలోని కొండలోని ఒక భాగంలో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌పై ఉన్న సోలార్‌పైపులు శిలువ ఆకారంలో వచ్చేలా ఫోటోలు తీసి తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ గుర్తించింది. ఈ మేరకు తిరుమల టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరైనా సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.