క్రైమ్/లీగల్

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కూకట్‌పల్లి, ఆగస్టు 31: కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
అతడి సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హేమంత్ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సతీష్ హత్య కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వీరిద్దరితో ఎంత కాలంగా పరిచయం ఉందనే సమాచారంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. సతీశ్ బాబు, హేమంత్ భాగస్వామయంతో నెకొల్పిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆ యువతి ఉద్యోగిగా పనిచేస్తోంది.
అయితే , ఆ అమ్మాయితో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. అంతే కాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఇద్దరి మధ్య వైరం పెరిగినట్టు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే హేమంత్ ముందస్తు ప్రణాళిక ప్రకారం సతీశ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, సతీశ్‌ను ఇంత దారుణంగా ఒక్కడే హత్య చేశాడా? లేకపోతే అతడికి ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.