క్రైమ్/లీగల్

తూర్పు గోదావరిలో ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం/శంఖవరం, సెప్టెంబర్ 1: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు దుర్ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒక దుర్ఘటనలో ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందగా, మరో ఘటనలో కాలుజారి చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. వివరాలిలావున్నాయి... సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా యంపా వెంకటలక్ష్మి(26) ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలు ప్రసాద్ (8), అనుపమ (6)తో కలిసి కూనవరం నుండి కోటి గ్రామం వెళ్తుండగా, ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయారు. రాత్రి 8 గంటల సమయంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
మరో ఘటనలో మండల కేంద్రం శంఖవరం అరుంధతీపేటకు చెందిన బొడ్డపాటి వీర ప్రకాష్(11) , పాయకరావుపేట మండలంలోని గోపాలపట్నంకు చెందిన గల్లంకి నగేష్(10) ఆదివారం బంధువు కొలు వీరబాబుతో కలిసి గ్రామ శివార్లలోని ఊరచెరువు వద్దకు వెళ్లారు. వీరబాబు బైక్ శుభ్రం చేసుకుంటుండగా, ప్రకాష్, నగేష్ గట్టుపై ఆడుకుంటున్నారు. ఆ సమయంలో వారిద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. నీటిలో మునిగిపోతున్న వారిని గమనించిన వీరబాబు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువువద్దకు చేరుకుని, మునిగిపోయిన వారిద్దరినీ వెలికితీసి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతిచెందారు. మృతుల్లో ప్రకాష్ దివ్యాంగుడు కాగా, నగేష్ సెలవులు కావడంతో శంఖవరంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అన్నవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.