క్రైమ్/లీగల్

ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలోని ఎస్‌ఎల్‌ఆర్ తుపాకి మిస్ ఫైర్ జరిగి గాయాలకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి తంగళ్ళపల్ల మండలం తాడూరులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో మిస్ ఫైర్ జరిగి గాయాల పాలైన సత్యనారాయణను సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స నిర్వహించగా, ఆయనకు రక్తస్రావం తీవ్రం కావడంతో సిరిసిల్ల నండి కరీంనగర్ తరలించారు. ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ రాత్రి 8.15 గంటల సమయంలో గార్డు డ్యూటీ ఎక్కుతూ, డ్యూటీలో చేరుతున్న సమయంలో తన చేతిలోని ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని చెక్ చేస్తూండగా మిస్ ఫైర్ అయింది. ఈ సంఘటనలో అతడి చెంప, చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. రక్త స్రావం తీవ్రం అవుతున్న దశలో అతడిని హుటా హుటిన సిరిసిల్లలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి చికిత్స నిర్వహించారు. అయితే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యలో సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో తృటిలో కానిస్టేబుల్ ప్రాణాపాయం నుండి బయట పడగా, ఉన్నతాధికారులు సంఘటపై దర్యాప్తు జరుపుతున్నారు.