క్రైమ్/లీగల్

5 వరకు చిదంబరం కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం కస్టడీ ఈనెల 5వ తేదీ వరకూ కొనసాగుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తక్షణమే తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయాలని చిదంబరం తరఫు లాయర్ చేసిన వాదనను న్యాయమూర్తులు ఆర్. భానుమతి, ఏఎస్ బొపన్న సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. గురువారం నాడు ఈ కేసు లిస్టింగ్‌కు వస్తుందని, తాత్కాలిక బెయిల్ అంశాన్ని కూడా అప్పుడే విచారిస్తామని తేల్చిచెప్పింది. అప్పటి వరకూ సీబీఐ కస్టడీలోనే చిదరంబరం ఉంటారని పేర్కొంది. కాగా, మంగళవారం చిదంబరం తరఫు లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలు వినిపిస్తూ, సీబీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. తాత్కాలిక బెయిల్‌ను ఇవ్వడం వల్ల కేసు తప్పుతో పట్టే ప్రమాదం ఉందని అన్నారు. బెయిల్ పిటిషన్‌పై 24 గంటల్లోగా స్పందన తెలియచేయాలని సీబీఐకి ట్రయల్ జడ్జి ఆదేశాలు జారీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు విచారణకు వచ్చిందని అన్నారు. చిదంబరాన్ని అరెస్టు చేసిన 13 రోజుల తర్వాత, సీబీఐని 24 గంటల్లోగా స్పందించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం సరైన విధానం కాదని వాదించారు. ఆ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సభ్యులు జోక్యం చేసుకొని, కేసు ఈనెల 5వ తేదీ, గురువారం రోజున లిస్టింగ్ అయిందని అన్నారు. అప్పుడే బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అంతవరకూ ఆయన బీసీఐ కస్టడిలోనే ఉండాలని తెలిపారు. ఒకవేళ సీబీఐ ఆయనను కస్టడీలోకి తీసుకోకపోయినా, చట్టం జోక్యం అవసరమయ్యేదని అన్నారు. అదే జరిగితే, చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం సీబీఐకి ఉండేదని కాదని వ్యాఖ్యానించారు. మెహతా వాదనను చిదరంబరం తరఫు లాయర్లు సిబల్, సింఘ్వీ తోసిపుచ్చారు. చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే, బెంచ్ ముందు ఉన్న బెయిల్ పిటిషన్ నిష్ప్రయోజనమవుతుందని అన్నారు. గురువారం వరకూ సీబీఐ కస్టడీలో ఉండాలన్న బెంచ్ ఆదేశాలను శిరసావహిస్తామని, అయితే, చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపవద్దని బెంచ్‌ని కోరారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపైనా కేసులు ఉన్నాయి.