క్రైమ్/లీగల్

ప్రేమ పెళ్లి కోసం మతం మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 3: కులాలు వేరైనా ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. ఆరు సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. తక్కువ కులం దానివి అని భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం ప్రకారం.. వరంగల్ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి అలియాస్ షాబాన(26), రఫిక్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మల్కాజిగిరి పరిధిలోని మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరివి వేరే కులాలు కావడంతో.. కృష్ణవేణి భర్త, అత్తగారి కుటుంబసభ్యుల కోరిక మేరకు 2013లో మతం మార్చుకున్నట్టు తెలిపారు. కృష్ణవేణికి నాలుగు సార్లు అబార్షన్ కావడంతో.. పిల్లలు కావాలని రఫిక్ కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ మల్కాజిగిరి పోలీసులకు బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రఫిక్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
అత్తగారి కుటుంబ సభ్యుల ఒత్తిడితో మతం మారాను: కృష్ణవేణి
రఫిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను అత్తగారి కుటుంబ సభ్యులు బలవంతంగా మతం మార్చారని కృష్ణవేణి అలియాస్ షాబానా తెలిపారు. వరంగల్‌కు చెందిన రఫిక్ తను ప్రేమ పెళ్లి చేసుకుని ఆరు నెలలు విడిగా ఉన్నామని తెలిపారు. మతం మారితేనే కుమారుడితో కలసి ఉండనిస్తామని చెప్పడంతో ఇష్టం లేకపోయినా మతం మారి అతడిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అత్తగారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తూ తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని పేర్కొంది. తనకు తగిన న్యాయం చేయాలని కృష్ణవేణి కోరింది.