క్రైమ్/లీగల్

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 3: నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం స్థానిక సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ముందు హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలియజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస అయిన రాజేష్ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో కొంత మంది బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురక మమతా, మత్తు వేణు, తమ్మిశెట్టి బాల వీర స్వామిల మద్దతుతో ప్రజలకు నకిలీ బంగారం అమ్మి మోసం చేయాలని పథకం పన్నాడు. ఈ పథకంలో భాగంగానే బంటుమిల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కూలి పనులకు వెళుతూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. గత జూన్ 21వతేదీన సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఎం దుర్గా భవానీని సంప్రదించి నకిలీ బంగారం ఇచ్చి వారి వద్ద నుండి రూ.20వేలు నగదు, అసలు బంగారపు గొలుసు, దిద్దులు కాజేశారు. ఈ ముఠా గతంలో నరసరావుపేట, విశాఖపట్నం, నంద్యాల, దేవరపల్లి, బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రకమైన మోలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. మచిలీపట్నంలో కూడా మోసాలకు పాల్పడే ప్రయత్నం చేయగా ఈ ముఠాను గుర్తించిన సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని డీఎస్పీ అజీజ్ తెలిపారు. నిందితుల నుండి 24 గ్రాముల బంగారం, రూ.500 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తురక సురేష్, తురక మమతాలను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ సుబ్బారావు, సీసీఎస్ ఎస్‌ఐలు హబీబ్ బాషా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యభిచార గృహం నిర్వాహకుల అరెస్ట్
విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 3: భవానీపురం హెచ్‌బీ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. మాచవరానికి చెందిన పీ నాగరత్నం(38) హైదరాబాద్ కూకట్‌పల్లి హెచ్‌బీ కాలనీకి చెందిన కృష్ణకుమారి(40) భవానీపురంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విద్యాధరపురానికి చెందిన కళ్యాణ్(24), భవానీపురానికి చెందిన దస్తగిరి(52)తో పాటు వ్యభిచారిణి షకీలా(20)ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. షకీలాని భవానీపురంలోని హోమ్‌కి తరలించారు. మిగతా నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు భవానీపురం సీఐ వివరించారు.

పాముకాటుకు గురై మహిళ మృతి
నాగాయలంక, సెప్టెంబర్ 3: పాముకాటుకు మరో మహిళ మృతి చెందింది. మండల పరిధిలోని పెదపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ (30) మంగళవారం తన ఇంట్లో నిద్రిస్తుండగా ఓ విష సర్పం కాటు వేయటంతో ఆమె పరిస్థితి విషమించింది. హుటాహుటిన నాగేశ్వరమ్మను 108 అంబులెన్స్‌లో నాగాయలంక పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి జిల్లా కేంద్రం మచిలీపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా కృష్ణ తెలిపారు.