క్రైమ్/లీగల్

కన్నకొడుకే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం (రామప్ప), సెప్టెంబర్ 3: కన్నకొడుకే కాలయముడై తాగిన మైకంలో విచక్షణ రహితంగా కర్రతో దాడి చేసి తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తాళ్లపాడుకు చెందిన గురుమూర్తి తన మొదటి భార్య రాజేశ్వరికి పిల్లలు కలగకపోవడంతో శాయంపేటకు చెందిన సుశీలను రెండవ వివాహం చేసుకున్నాడు. సుశీలకు వేణు, సింధూజ జన్మించారు. వేణు మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులతో గొడవపడే వాడు. ఈ క్రమంలో గురుమూర్తి మొదటి భార్య రాజేశ్వరితో హుజూరాబాద్‌లోని తుమ్మనపెల్లిలో జీవనం కొనసాగిస్తున్నాడు. సుశీల మాత్రం తాగుడుకు బానిసైన కొడుకు వేణుతో తాళ్లపాడులో ఉంటోంది. కూతురు సింధూజ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం రాత్రి సుశీల (50) ఆరోగ్యం బాగాలేకుంటే మందులు తీసుకురమ్మని వేణుకు వెయ్యి రూపాయలు ఇవ్వగా మందులు తేకుండా ఆ డబ్బులతో తాగి ఇంటికి వచ్చి మరిన్ని డబ్బులు ఇవ్వాలని సుశీలతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇంటి ముందున్న కర్రతో తల్లి సుశీలపై దాడి చేశాడు. దీంతో తలకు తీవ్రంగా గాయం కావడంతో సుశీల అక్కడికక్కడే మృతి చెందింది. ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా కోసం మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త గురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెంకటాపురం పోలీసులు తెలిపారు.
చిత్రం...సుశీల మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ దేవేందర్