క్రైమ్/లీగల్

ఆన్‌లైన్ మోసగాళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లాప్‌టాప్‌లు, 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని యాక్సిస్, కెనరాబ్యాంక్, బరోడా, ఐసీఐసీఐ బ్యాంకుల అక్కౌంట్లను సీజ్ చేశారు. కేసుకు సంబంధించి నగర సీసీఎస్ డీసీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు రోషన్ కుమార్ సింగ్, ఆషీశ్ సింగ్, లోకేశ్ శర్మ, జితేందర్ కుమార్‌లను అంబర్‌పేటకు చెందిన టీ.అరుణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ షాపింగ్ యూజర్లకు లాటరీలు, గిఫ్ట్‌లు తగిలాయని ఆశ చూపించి వారి వివరాలు పంపాలని ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తారు. ఆ వివరాల ద్వారా వారి బ్యాంక్ అక్కౌంట్లలోని డబ్బును నిందితుల అక్కౌంట్లలోకి, ఈ-వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు. బాధితుడికి ఇలాగే సమాచారం ఇచ్చి మారుతి కారు లాటరీలో వచ్చిందని నమ్మబలికి రూ.2.30 లక్షలు సొమ్ము దశలవారీగా తీసుకున్నారు. డబ్బు బదిలీ కాగానే నిందితుల సెల్‌ఫోన్ స్విచ్చ్ఫా అయ్యింది. బాధితుడు అరుణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఆ వివరాలతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బి.మధుసూధన్ నేతృత్వంలోని ఎస్‌ఐలు పరమేశ్వర్, వినయ్‌కుమార్ బృందం నిందితులను గాలించి పట్టుకుంది.