క్రైమ్/లీగల్

వివేకా హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాద్రిపురం, సెప్టెంబర్ 3: మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాసులరెడ్డి (52) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివేకా హత్య కేసులో సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులరెడ్డిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో తనను, తన కుటుంబసభ్యులను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ శ్రీనివాసులరెడ్డి సోమవారం రాత్రి తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు కడప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందుకుముందు సూసైడ్ నోట్ కూడా రాసినట్లు సమాచారం. పులివెందుల సీఐ శ్రీరాములు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. అవే లేఖలను ముఖ్యమంత్రి జగన్, పులివెందుల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వైఎస్.భాస్కర్‌రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాసులరెడ్డి (పాతచిత్రం)