క్రైమ్/లీగల్

నవయుగ పిటిషన్ విచారణ 12కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడం చట్ట విరుద్ధమని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని సంస్థ వైఫల్యంగా పేర్కొనడం అన్యాయమంటూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కేటాయించిన 412 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం తెలిసిందే. సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొనడం తెలిసిందే. ఒప్పందాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోర్టును నవయుగ సంస్థ కోరింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించిన కారణంగా విచారణను వాయిదా వేసింది.