క్రైమ్/లీగల్

తరిగామిని ఎయిమ్స్‌కు తరలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: శ్రీనగర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసుఫ్ తరిగామిని మెరుగయిన వైద్యచికిత్స కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకురావాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తరిగామి ఆరోగ్య పరిస్థితిపై శ్రీనగర్‌లోని షేర్ ఐ కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (స్కిమ్స్), ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) వైద్యుల మధ్య సంప్రదింపుల తరువాత ఆయనను ఎయిమ్స్‌కు తరలించడం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి, న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఎలాంటి ఆదేశాలు లేకుండా తరిగామిని నిర్బంధించారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూకాశ్మీర్ పాలనాయంత్రాంగానికి నోటీసులు కూడా జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం ఈ అంశాన్ని తదుపరి విచారణ కోసం సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. ‘ఆగస్టు 28న ఈ కోర్టు జారీ చేసిన ఆదేశం ప్రకారం పిటిషనర్ (ఏచూరి) సమర్పించిన నివేదికను పరిశీలించిన తరువాత మొహమ్మద్ యూసుఫ్ తరిగామిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి మేము వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం శ్రీనగర్‌లోని స్కిమ్స్ వైద్యులు, నిపుణులతో చర్చించి ఎప్పుడు, ఎలా తరలించాలనే అంశాన్ని నిర్ణయిస్తుంది’ అని ధర్మాసనం తన ఆదేశాలలో పేర్కొంది. సంబంధిత అధికారులు తరిగామిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తారని తెలిపింది. తరిగామి ఎంచుకున్న అతని కుటుంబ సభ్యుల్లో ఒకరు అతనితో పాటు ఎయిమ్స్‌కు వచ్చేప్పుడు వెంట ఉంటారని వివరించింది. తరిగామిని మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌కు తరలిస్తే తమకేమి అభ్యంతరం లేదని, అయితే, హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా తరిగామి నిర్బంధాన్ని సవాలు చేసే హక్కు తమకు ఉండాలని ఏచూరి ధర్మాసనాన్ని కోరారు. జమ్మూకాశ్మీర్‌కు వెళ్లి తరిగామి ఆరోగ్య పరిస్థితిపై అఫిడవిట్ సమర్పించడానికి అత్యున్నత న్యాయస్థానం తనకు అనుమతి ఇచ్చిందని ఏచూరి ధర్మాసనానికి చెప్పారు.