క్రైమ్/లీగల్

ప్రియురాలి కోసమే హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును కేపీహెచ్‌బీ పోలీసులు ఛేదించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్ హతమార్చాడని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలను వెల్లడించారు. సతీష్, హేమంత్‌లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాడు. ఓ రోజు సతీష్‌ను హేమంత్ కలుసుకుని ఉద్యోగం ఇప్పించాలని కోరగా తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. కొద్ది రోజుల అనంతరం హేమంత్, సతీష్‌లు ఇద్దరు భాగస్వాములుగా ఓ ఐటీ కంపెనీని నెలకొల్పారు. ఈ క్రమంలో 2016 లో తన దగ్గర కోచింగ్ తీసుకుని తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న ప్రియాంకను సతీష్ హేమంత్‌కు పరిచయం చేశాడు. అంతకుముందే సతీష్‌కు ప్రియాంకకు మధ్య సాన్నిహిత్యం ఉండేది. ప్రియాంక కేపీహెచ్‌బీలో ఉన్న ఉమెన్స్ హస్టల్‌లో ఉండేది. ఈ సమయంలోనే ప్రియాంకతో హేమంత్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఇదే విషయం హేమంత్ భార్యకు తెలిసి ఇద్దరి మధ్య వివాదం నెలకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హేమంత్, ప్రియాంక ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత మూడు నెలలుగా హేమంత్, ప్రియాంక ఒకే గదిలో సహజీవనం చేశారు. ఈ విషయం సతీష్‌కు తెలిసి హేమంత్‌ను హెచ్చరించాడు. ప్రియాంకకు మంచి భవిష్యత్ ఉందని, ఆమెతో కలిసి ఉండొద్దని హేమంత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కంపెనీ కూడా నష్టాలు రావడంతో జీతం కూడా తగ్గించాడు. అప్పటి నుంచి సతీష్‌పై హేమంత్ ద్వేషం పెంచుకుంటూ వచ్చాడు. ప్రియాంక కూడా దూరం అవుతుందని భావించి కక్ష పెంచుకుని సతీష్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. గత నెల 28న సతీష్‌ను పార్టీ చేసుకుందామని చెప్పి నమ్మించి హేమంత్ ఇంటికి రప్పించుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న సతీష్ తలపై రాడ్డుతో బలంగా కొట్టడమే కాకుండా కత్తితో తీవ్రంగా గాయపరిచి చంపాడు. అనంతరం బాడీని కారులో తరలించాలని ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. తిరిగి రూమ్‌కి వచ్చిన హేమంత్ మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్ళాడు. తన భర్త కనిపించడం లేదని సతీష్ భార్య ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో కూడా ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరికొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చారు. దర్యాప్తు అనంతరం అన్ని ఆధారాలు సేకరించిన తరువాతనే నిందితుడు హేమంత్ అని తెల్చినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

చిత్రం...సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్‌రావు