క్రైమ్/లీగల్

స్వామి చిన్మయానంద కళాశాల, ఆశ్రమాల్లో సిట్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సెప్టెంబర్ 7: లా విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద ఇంటితోపాటు ఆయన ఆధ్వర్యంలోని ఆశ్రమం, కాలేజీలను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సందర్శించింది. ఐజీ నవీన్ అరోరా నేతృత్వంలోని సిట్ బృందాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థిని చదివిన లా కళాశాలను సందర్శించిన సిట్ బృందం అక్కడి ప్రిన్సిపాల్‌ను, ఇతర సిబ్బందిని కలుసుకొని కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొంది. గురువారం రాత్రి చిన్మయానంద నివాసమైన దివ్యధామ్‌తో పాటు ఆయన ఆధ్వర్యంలోని ఐదు కళాశాలలను సైతం సిట్ బృందం సందర్శించి వివరాలు సేకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ అవ్‌నిష్ మిశ్రా శుక్రవారం తెలిపారు. కళాశాలతో పాటు ఆశ్రమాల్లో సైతం సిట్ సందర్శించిన సమయంలో చిన్మయానంద అందుబాటులో లేకపోవడంతో ఆయన్ను ప్రశ్నించడానికి వీలు కుదరలేదు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఆగస్టు 27వ తేదీన స్వామి చిన్మయానందపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు తనపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలను సుప్రీంకోర్టు తెలియజేయగా.. అలహాబాద్ హైకోర్టు విచారిస్తుందని పేర్కొంది. సీజ్ చేసిన విద్యార్థిని కళాశాల రూంను సైతం సందర్శించి తోటి విద్యార్థులను కూడా సిట్ ప్రశ్నించింది. చిన్మయానందపై ఆరోపణలను వీడియోద్వారా మహిళ తెలియజేయడంతో ఆమె ఇంటిని సైతం సిట్ సందర్శించింది. అయితే, ఆమె అందుబాటులో లేకపోవడంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది.