క్రైమ్/లీగల్

స్కూల్ బస్సు వెనుక టైరు ఢీకొని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, సెప్టెంబర్ 7: ప్రమాదవశాత్తు బాలుడు బస్సు వెనుక టైర్ కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని కుందావారి కండ్రిక గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో నివాసముంటున్న గంగరాజుకు పాప, బాబు సంతానం. పాపను పాయకాపురంలోని అక్షర నందన స్కూల్‌లో చదివిస్తున్నాడు. శనివారం ఉదయం పాపను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తీసుకొని వెళ్లగా, తండ్రితోపాటు కపిలవాయి ఏకలవ్య మూరారి(18నెలలు) తండ్రి చేయి పట్టుకుని వచ్చాడు. సోదరి స్కూల్ బస్సు ఎక్కుతుండగా బస్సు కదిలే సమయంలో తండ్రి చేయి విదిలించి పరుగెత్తాడు. ఈ క్రమంలో బస్సు వెనుక టైర్ బాబును ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలైన మురారిని తండ్రి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ మేరకు 304ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.