క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై విచారణ 11కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం దాఖమలు చేసిన కౌంటర్‌పై అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు తమ వాదనలను వినిపించారు. వార్డుల విభజన , జనాభా నిష్పత్తికి సంబంధించిన లోపాలను సరిచేయడం జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, వాస్తవిక స్థితికి పొంతన లేదని పిటిషనర్లు వాదించారు. చిన్న చిన్న లోపాలను బూతద్దంలో పెట్టి చూడాల్సిన
అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వార్డుల విభజనలో మార్పులు ఉన్నట్టయితే ఆ పరిధిలోనే ఉంటాయని హైకోర్టు పేర్కొంది. వార్డుల విభజన వల్ల ఓటర్లు పరిధి ఒక జిల్లా నుండి మరో జిల్లాకు మారిపోవని పిటిషనర్లకు చెబుతూనే చిన్న చిన్న లోపాలను సైతం సరిచేసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. బుధవారం నాడు మరో మారు ఇరువర్గాల పూర్తి వాదనలను వింటామని న్యాయమూర్తులు పేర్కొంటూ తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.
హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
అగ్రిగోల్డ్ కేసులో ఫోరెన్సిక్ నివేదికను సీఐడీ అందజేయడం లేదంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణలోని ఫోరెన్సిక్ నివేదికను తమకు సీఐడీ ఇవ్వడం లేదని ఈడీ పేర్కొంది. 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మందిని అగ్రిగోల్డ్ మోసం చేసిందని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సీబీఐకి, ఈడీకి ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ నిధులను అక్రమంగా విదేశాలకు తరలించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. మరోవైపు కేసును తెలంగాణ హైకోర్టు నుండి ఏపీకి బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును బదిలీ చేయవద్దని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున అధ్యక్షుడు రమేష్ బాబు కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మొత్తం మూడు పిటిషన్లపైనా ఈ నెల 26న హైకోర్టు విచారణ జరపనుంది.