క్రైమ్/లీగల్

33 మంది ఈవ్‌టీజర్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 14: మహిళలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డ 33 మందిపై ఈవ్‌టీజర్లను పట్టుకోవటంతోపాటు ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మహిళలు, అమ్మాయిలపై జరిగే నేరాలపై తక్షణ సమాచారం అందిస్తే చర్యలు సైతం తీసుకోవటం జరుగుతుందన్నారు. శనివారం మహిళా రక్షక్ బృందాల వారం రోజుల పనితీరుపై ఎస్పీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో మహిళా రక్షక్ బృందాలు గత వారం 33 మందిని ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందన్నారు. ఇందులో ఒక్క రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ముగ్గురిపై కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. మిగతా వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించి పంపటం జరిగిందన్నారు. మరోసారి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామన్నారు. కళాశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, పార్కులు, దేవాలయాలు తదితర 98 ప్రాంతాల్లో మహిళ రక్షక్ బృందాలు నిఘా వేసి ఉంచడం జరిగిందన్నారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో ఏడుగురు, ధర్మవరంలో ఐదుమంది, తాడిపత్రిలో ఐదుగురు, కదిరిలో ఒకరు, గుంతకల్లులో ఆరుగురు, కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 14 మంది ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందన్నారు.