క్రైమ్/లీగల్

బెరాకా మినిస్ట్రీస్‌లో బాలిక అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 14: జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు హర్ష జూనియర్ కళాశాల సమీపంలో కొనసాగుతున్న ఓ స్వచ్చంద సేవా సంస్థకు చెందిన హాస్టల్ కం స్కూల్‌లో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బెరాకా మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండిశెట్టి ప్రైజీ (15) బెరాకా మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్‌లో 2014వ సంవత్సరం నుండి ఆశ్రయం పొందుతోంది. చిట్టిపాలెంలోని జెడ్పీ హైస్కూలులో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి విద్యార్థిని ప్రైజీ తీవ్రమైన కడుపు నొప్పికి గురవ్వగా మాత్రలు వేసుకుని పడుకుంది. శనివారం ఉదయం అందరి విద్యార్థులతో కలిసి ప్రెసి లెగకపోవటంతో గుర్తించిన వార్డెన్ వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొండయ్య బాలిక మృతికి గల కారణాలను సహచర విద్యార్థినులు, హాస్టల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ సునీల్ కూడా హాస్టల్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాషా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.