క్రైమ్/లీగల్

తల్లీ కొడుకు ఆత్మహత్యాయత్నం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 17: గుడివాడ వాసవీచౌక్‌లోని శోభన హోటల్‌లో పురుగుమందు తాగి తల్లీ కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన జానకీదేవి(57), ఆమె కుమారుడు చైతన్య(31)లు హోటల్‌లో రూం నెంబరు 204లో ఈ నెల 9వ తేదీ నుండి ఉంటున్నారు. గతంలో పలుమార్లు వీరిద్దరూ వచ్చి ఇదే లాడ్జిలో బస చేసి వెళ్ళారు. సోమవారం రాత్రి జానకీదేవి, చైతన్యలు తమతో తెచ్చుకున్న క్లోరిఫైరిఫాస్ పురుగుల మందును తాగారు. హోటల్ గది నుండి పురుగుల మందు వాసన వస్తుండడాన్ని సిబ్బంది గమనించారు. తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. సిబ్బంది అరుపులకు జానకీదేవి లేచి తలుపు గడియ తీసి అక్కడే కుప్ప కూలిపోయారు. అప్పటికే చైతన్య మృతి చెంది పడివున్నాడు. వెంటనే జానకీదేవిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జానకీదేవికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు టూటౌన్ సీఐ ఎల్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.