క్రైమ్/లీగల్

బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, సెప్టెంబర్ 20: గోదావరి వరద ఉద్ధృతంగా ఉన్న సమయం లో నిబంధనలకు విరుద్ధంగా పాపికొండలు విహారయాత్రకు బోటు నడిపి, అనేకమంది యాత్రికుల మరణానికి కారణమైన శ్రీ వశిష్ఠపున్నమి రాయల్ టూరిస్టు బోర్డు యజమాన్యానికి సంబంధించి ముగ్గురిని అరెస్టుచేశామని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కోడిగుడ్ల వెంకటరమణ, యాళ్ల భారతి, యర్రంశెట్టి అచ్యుతామణిని అదుపులోకి తీసుకుని రంపచోడవరం కోర్టుకు తరలించామన్నారు. రంపచోడవరం పోలీసు స్టేషనులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. యాత్రికుల నుంచి డబ్బులు వసూలుచేసి, బోటులో ఎక్కించుకుని ఎనిమిది మంది సిబ్బంది సహా మొత్తం 75 మందితో వరద ఉద్ధృతంగా ఉన్నప్పటికీ, గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా పాపికొండలు యాత్రకు తీసుకువెళ్లారని ఏఎస్పీ తెలిపారు. బోటు డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్లాల్సిన దారిలో కాకుండా గోదావరి మధ్యలో నుంచి నడపటంవల్ల దేవీపట్నం మండలం కచ్చులూరు మందంవద్ద వరద ఉద్ధృతికి బోటు నీటమునిగిపోయిదన్నారు. 34 మంది యాత్రికుల మరణానికి, మరో 12 మంది యాత్రికులు, ముగ్గురు బోటు సిబ్బంది జాడ తెలియకపోవడానికి కారణమైన బోటు యాజమాన్యం, టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యంపై దేవీపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదుచేశామన్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నామన్నారు. గోదావరి నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉందని తెలిసి కూడా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నైపుణ్యంలేని డ్రైవర్లతో యాత్రికులను పాపికొండలు విహారయాత్రకు పంపి బోటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇంకా జాడ తెలియనివారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బంది, ఉన్నతాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, అనపర్తి సీఐ భాస్కరరావు, రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు, రంపచోడవరం ఎస్సై హరిబాబు తదితరులు పాల్గొన్నారు.