క్రైమ్/లీగల్

నిందితుడికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 20: అభం శుభం తెలియని చిన్నారిని బలిగొన్న మానవ మృగాడికి సరైన శిక్షే పడింది. 21 నెలల పాటు కొనసాగిన ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ జిల్లా అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం సంచలనమైన తీర్పు వెల్లడించారు. మొత్తం 14 మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. అమానవీయ నేరానికి సరైన శిక్ష పడిందని కొందరు, ఉరి శిక్ష విధిస్తే ఇంకా బాగుండేదని మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 2017 డిసెంబర్ 3న రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రవళిక-రాజుల దంపతుల కూతురు 7 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన కనకం శివ అనే యువకుడు అపహరించుకుపోయి గ్రామ శివారులో అత్యాచారం, హత్య చేశాడు. తల్లిదండ్రులపై ఉన్న కోపంతో, పగతో బాలికను అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించి వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన కేవలం మూడు రోజులకు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుండి జిల్లా ఎస్పీ ఆర్.్భస్కరన్ ఆదేశాలతో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్ నిందితుడిపై ఐపీసీ 364, 302, 201, 376 కేసులను నమోదు చేసి చార్జ్‌షీటు వేశారు. సాక్షులను ప్రవేశపెట్టి నేరం అంగీకరించడంతో 21 నెలల తరువాత మొదటి అదనపు సెషన్స్ జడ్జి కె.జయకుమార్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నిందితుడు శివకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 364 ఐపీసీ సెక్షన్ కింద 10 సంవత్సరాలు, వెయ్యి రూపాయల జరిమానా, ఐపీసీ 302 సెక్షన్ కింద రూ.5వేల జరిమానా, జీవిత ఖైదు, ఐపీసీ 201 సెక్షన్ కింద 3 సంవత్సరాలు, ఐపీసీ 376 కింద జీవిత ఖైదు, జరిమానా విధించినట్టు జడ్జి తీర్పునిచ్చారు. కాగా జూన్ 18న వరంగల్ నగరంలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో వెలువడిన కోర్టు తీర్పు మానవ మృగాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.