క్రైమ్/లీగల్

భూమి పోయిందని రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 15: మండల పరిధిలోని వేపచర్ల ఎగువతండాకు చెందిన కేశవనాయక్ (42)కి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కేటాయించిన భూమి టీడీపీ వారు లాగేసుకున్నందుకు వ్యధ చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేపచర్ల ఎగువతాండాకు చెందిన కేశవనాయక్‌కు 507.2 సర్వే నెంబర్‌లో 3.21 ఎకరాల భూమి కేటాయించింది. కేశవనాయక్ ఆ భూమిపై రూ.70 వేలు బ్యాంక్‌లో క్రాప్ లోన్ తీసుకున్నాడు. కేశవనాయక్ క్రిమిసంహారక మందు సేవించి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల, ఏప్రిల్ 15 : స్థానిక మోహన్‌రావు కాలనీకి చెందిన మల్లెల శ్రీనివాసులు (32) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. మూడు రోజుల క్రితం తన భార్య పావని అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. ఆమె మృతి భరించలేక ఆదివారం ఇంట్లో ఉన్న సూపర్ వాస్మోల్ తాగినట్లు చెప్పారు. దీన్ని గమనించిన తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స జరిపించారు. అయితే పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.