క్రైమ్/లీగల్

రెండు రైస్‌మిల్లుల యజమానులపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 15: రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశ్యంతో రెండు రైస్ మిల్లుల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మనుబోలు మండలానికి చెందిన కొంత మంది రైతులు వరి ధాన్యాన్ని నవలాకులతోటలోని శ్రీ కృష్ణా సాయి రైస్‌మిల్లు, వెంకటసాయి రైస్‌మిల్లులకు తమ ధాన్యాన్ని శనివారం తీసుకొచ్చారు. ఆ రెండు రైస్ మిల్లుల యజమానులు రాఘవయ్య, వీరాంజనేయులు రైతులను మోసం చేయడానికి ప్రయత్నించారని, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, తేమ అధికంగా ఉందని బ్లాక్ మెయిల్ చేయడం తదితర వేధింపులకు గురిచేసినట్లు సంబంధిత రైతులు సివిల్ సప్లయ్ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ సీఐకి రైస్ మిల్లుల యజమానుల ఆగడాల గురించి తెలియజేశారు. వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి రెండు రైస్ మిల్లులకు సంబంధించిన యజమానులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.