క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, అక్టోబర్ 9: దసరా పండుగ పూట విషాదం నెలకొంది. విజయదశమి వేడుకలను బంధువుల ఇంట్లో ఆనందంగా జరుపుకునేందుకు బయలుదేరిన దంపతులు మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన విషాద సంఘటన 65వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పామనగుండ్ల శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన కోక పరమేష్ (30) దసరా వేడుకలను తన అత్తగారి ఊరైన కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో జరుపుకునేందుకు భార్య, కుమారుడు, మేనల్లుడితో కలిసి మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయరహదారిపై మండలంలోని పామనగుండ్ల గ్రామ సమీపంలోని టీమెజ్ పరిశ్రమ వద్ద విజయవాడ వైపు వెళ్తున్న టీఎస్ 08 యూబీ 8891 నెంబరు గల కారు వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఈ దాటికి బైక్ సుమారు వందమీటర్ల దూరానికి ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో కొక పరమేష్ భార్య కోక అనిత (28) తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే దుర్మరణం చెందగా పరమేష్, ఆరేళ్ల అతని కుమారుడు మున్నా, మేనల్లుడు మల్లెపోగు కల్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కట్టంగూర్ ఎస్‌ఐ నర్రా అంతిరెడ్డి హుటహుటిన ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను నార్కట్‌పల్లి సమీపంలోని కామినేనిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9గంటల సమయంలో పరమేష్ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పరమేష్ కుమారుడు, అల్లుడులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువు ఆదిమళ్ల శంకర్ ఫిర్యాదు మేరకు కట్టంగూర్ ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పండుగ పూట భార్యభర్తలు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన అందరిని కలిచివేసింది. అటు మృతుల స్వగ్రామమైన చెర్వుగట్టుతో పాటు అత్తగారి ఊరైన అయిటిపాములలో విషాద చాయలు ఆలుముకున్నాయి.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
కేతేపల్లి : హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో ఇనుపాముల గ్రామ శివారులో జరిగిన వేర్వురు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మణం పాలయ్యారు. ఈ ప్రమాదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఇనుపాముల జంక్షన్ సమీపంలో నకిరేకల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టడంతో నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జిల్లా విశాల్ (10) అక్కడిక్కడే మృతిచెందగా వాహనం నడుపుతున్న తండ్రి బాబు, తల్లి వెనె్నల, అక్క పుష్పలకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఇనుపాముల గుట్ట సమీపంలో పదిన్నర గంటల సమయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలకేంద్రానికి చెందిన పందిరి యాదయ్య (65) మధిర నుండి కారులో చిట్యాలకు వెళ్తూ ఇనుపాముల గుట్ట వద్ద రోడ్డుపక్కన కారు ఆపి నిలబడి ఉండగా వెనుకనుండి వచ్చిన ట్యాంకర్ వేగంగా ఢీకొట్టంతో కారు, ట్యాంకర్ వాహనాలు యాదయ్య శరీరంపై నుండి వెళ్లడంతో శరీరమంతా నుజ్జునుజ్జుయి అక్కడిక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న యాదయ్య భార్య నాగలక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.