క్రైమ్/లీగల్

ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో మరో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో తవ్విన కొద్ది కొత్తవిషయాలు బయటికివస్తున్నాయి. ఈ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న పాషాను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.28 కోట్ల మందుల కొనుగోళ్ల వ్యవహరంలో రాజేశ్వర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో అరెస్టయిన వెంకటేశ్వర్ హెల్త్ కేర్ ఎండీ అరవింద్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ సోదాలు ఇంక కొనసాగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఈఎస్‌ఐ మందులను తరలించారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చిన నేపథ్యం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఈఎస్‌ఐ ఉన్నతాధికారి దేవికారాణితో సహా మరికొందరు అదికారులు, సిబ్బంది ఇప్పటికే అరెస్టు చేయడం జరిగింది. దాదాపు వంద కోట్ల రూపాయల మేరకు ఈ కుంభకోణం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు భావిస్తున్నారు.