క్రైమ్/లీగల్

టివీవీ అధ్యక్షుడు మద్దిలేటి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ విద్యా వేదిక (టీవీవీ) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణను సైతం పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌లింగంపల్లిలోని ప్రజాఫ్రంట్ కార్యాలయం వద్ద అరెస్టుచేసి వీరిని గద్వాల్ పోలీస్టేషన్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌లో కొంతమంది టీవీవీ విద్యార్థులను మావోయిస్టుల్లో చేర్పించారని మద్దిలేటిపై పోలీసులు ఆరోపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా సెంట్రల్ కమిటీకి చెందిన తెలంగాణ నేతలను కలుస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. మావోయిస్టులకు వీరిద్దరూ డబ్బులు సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్దిలేటి ఇంట్లో జరిపిన సోదాల్లో పలు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మద్దిలేటి, కృష్ణతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నాగన్న, బలరాంపైనా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.