క్రైమ్/లీగల్

ప.గో.లో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, అక్టోబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం శివారు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. 90 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. అర కోటి మేర ఆస్తి నష్టం సంభవించివుంటుందని అంచనా. వంట గ్యాస్ సిలెండర్ పేలడం వల్ల ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి జుత్తు సేకరించే వృత్తిపై ఆధారపడిన వెనుకబడిన తరగతులకు చెందిన సుమారు 90 కుటుంబాల వారు గత 15 ఏళ్లుగా సజ్జాపురం శివార్లలో రేకుల షెడ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మహిళలు ఇంటింటికీ తిరిగి, తలనీలాలు సేకరించగా, వాటిని పురుషులు శుభ్రపరచి, ఎగుమతి సంస్థలకు విక్రయిస్తుంటారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వీరంతా ప్రార్థనామందిరానికి వెళ్లిన సమయంలో ఒక ఇంటిలోని వ్యక్తి వంట నిమిత్తం గ్యాస్ స్టౌ వెలిగించి, బయటకువచ్చాడు. గ్యాస్ స్టౌ వెలిగించివున్న విషయం మరచిపోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించి, గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. దీనితో మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించి, ఆ ఇళ్లల్లో ఉన్న వంట గ్యాస్ సిలెండర్లు సైతం పేలిపోయాయి. మంటలు అన్ని ఇళ్లకు వ్యాపించడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో కట్టుకున్న బట్టలు మినహా సర్వం బుగ్గిపాలయ్యాయి. మంటలను గమనించిన స్థానికంగా ఉన్న సామాజిక కార్యకర్త దుళ్లపూడి వెంకటలక్ష్మి తణుకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు స్పందించకపోవడంతో 108కు సమాచారం అందించడంతో వారు జిల్లాలోని ఇతర అగ్నిమాపక కేంద్రాల నెంబర్లు తెలిపారు. వెంకటలక్ష్మి ఆయా నెంబర్లకు ఫోన్ చేయడంతో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం నుండి అగ్నిమాపక శకటాలు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. తణుకు తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ బాధితులను పరామర్శించారు. లయన్స్, రోటరీ, మానవత తదితర సంస్థలు బాధితులను ఆదుకోవాలని కోరారు. సర్వం అగ్నిప్రమాదంలో కోల్పోవడంతో బాధితుల రోదన వర్ణనాతీతంగా వుంది.

*చిత్రం... అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇళ్లు