క్రైమ్/లీగల్

టెలికం కంపెనీలకు ‘సుప్రీం’ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తక్షణమే ఆదాయంలో భాగంగా ప్రభుత్వానికి ‘స్థూల ఆదాయంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తం’ (ఏజీఆర్) 90వేల కోట్లు చెల్లించాలని టెలికం కంపెనీలను సుప్రీం ఆదేశించింది. ఆయా టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 90వేల కోట్లను జమ చేయాల్సిందిగా ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఎస్‌ఏ నజీర్, ఎంఆర్‌షాల ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను ఈ సంవత్సరం జూలై నెలలోనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. ‘కేంద్ర టెలికం శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను మేం విచారణకు స్వీకరించాం.. సర్దుబాటు చేయాల్సిన మొత్తాన్ని జమచేయని ఎయిర్‌టెల్, ఓడాఫోన్, ఆర్‌కాం, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ల లైసెన్సులను రద్దు చేయాలని నిర్ణయించాం’ అని తీర్పును వెలువరిస్తూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి టెలికం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. టెలికం శాఖకు జమ చేయాల్సిన 90వేల కోట్లతో పాటు వడ్డీ, జరిమానాలను సైతం చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయంలో టెలికం కంపెనీల తరఫు నుంచి ఎలాంటి వ్యాజ్యాలను (లిటిగేషన్‌లు) స్వీకరించే ప్రసక్తే లేదని నిర్దద్వంగా తేల్చిచెప్పింది. ఆయా కంపెనీలు ‘స్థూల ఆదాయంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తం’ను టెలికమ్యూనికేషన్ల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు సవివరంగా పేర్కొంది. సుప్రీంకోర్టుకు టెలికం దాఖలు చేసిన అఫిడవిట్ మేరకు.. భారతి ఎయిర్‌టెల్ 21,682.13 కోట్లు లైసెన్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది. వొడాఫోన్ బకాయిలు రూ. 19,823.71 కోట్లు కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ 16,456.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్ 2,098.72 కోట్లు, ఎంటీఎన్‌ఎల్ 2,537.48 కోట్లు చెల్లించాల్సి ఉందని అఫిడవిట్‌లో టెలికం పేర్కొంది. గురువారం నాటికి అన్ని కంపెనీలు కలిపి 92,641.61 కోట్లను చెల్లించాల్సి ఉందని టెలికం శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టెలికం పాలసీ ప్రకారం ఆయా కంపెనీలు స్థూల ఆదాయం నుంచి ప్రభుత్వానికి కొంత వాటాగా నగదును సర్దుబాటు చేయాల్సి ఉంది. దీనినే ‘అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ’ (ఏజీఆర్)గా ప్రభుత్వం పేర్కొంది. మొత్తమీద ప్రతి టెలికం కంపెనీ తమ వాటాగా లైసెన్సు ఫీజు నిమిత్తం పై మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.
అలాగే, ఆయా కంపెనీలకు కేటాయించిన రేడియో ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో భాగంగా స్ప్రెక్ట్రం యూసేజ్ చార్జిలుగా కూడా కొంత మొత్తాన్ని టెలిఫోన్ ఆపరేటర్లు చెల్లించాల్సి ఉంది.