క్రైమ్/లీగల్

జ్యుడీషియల్ కస్టడీకి చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఐఎన్‌ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ. చందంబరాన్ని జ్యుడీషియల్ కష్టడీకి తరలిస్తూ స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ గురువారం ఆదేశాలు జారీ చేస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వీలుగా ఈనెల 30వ తేదీ వరకూ చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారని తెలిపారు. చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ హాస్యాస్పదంగా ఉందని, అందులో తీవ్రమైన ఆర్థిక నేరాలు ఏవీ లేవని ఆయన తరఫు లాయర్ వాదించినప్పటికీ, కోర్టు సానుకూలంగా స్పందించలేదు. 2007లో జరిగిందని చెప్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి అధికారులు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడాన్ని చిదరంబరం తన బెయిల్ పిటిషన్‌లో ప్రస్తావించారు. తనను మాత్రమే అరెస్టు చేయడాన్ని చూస్తుంటే, రాజకీయ కక్ష సాధింపుగానే కనిపిస్తున్నదని ఆరోపించారు. నిజానికి ఐఎన్‌ఎక్స్ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) క్షుణ్ణంగా పరిశీలించిందని వివరించారు. ఆతర్వాత 11 మంది అత్యున్నత అధికారులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఆ ప్రతిపాదనను ఆమోదించారని గుర్తుచేశారు. ఐఎన్‌ఎక్స్ ఒప్పందంలో ఇంత మంది అధికారుల పాత్ర ఉన్నప్పటికీ, వారిలో ఎవరినీ ప్రశ్నించకపోవడంలో అర్థం ఏమిటని చిదంబరం తరఫు లాయర్ ప్రశ్నించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా లభించిన స్వేచ్ఛా హక్కు చిదంబరానికి ఎందుకు లేదని ఆడిగారు. ఇది తీవ్రమైన కేసు కాదని, పైగా చిదంబరం ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని కోర్టును కోరా రు. ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని పదేపదే అభ్యర్థించారు. అయితే, ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ ఆయన అభ్యంతరాలను పట్టించుకోలేదు. చిదంబరాన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
*చిత్రం... కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం