క్రైమ్/లీగల్

బాధితులకు డబ్బు మీరే ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ట్రంలో వ్యాపిస్తున్న విష జ్వరాలపై సుప్రీం కోర్టు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘బాధితులకు మీ జేబుల్లో నుంచే డబ్బు ఇవ్వండి’ అంటూ ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విష జ్వరాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాధులు ముసురుకున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ కొనసాగించింది. బుధవారం నాటి విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సహా మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా హాజరుకావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చేందుకు ప్రధానకార్యదర్శిఋ ఎస్‌కే జోషి హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణపై హైకోర్టు బెంచ్
అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. విష జ్వరాల వ్యాప్తిని నిరోధించడానికి సూచనలు చేసే హోర్డింగ్‌లు ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. ఈ సమయంలో ప్రచలను అప్రమత్తం చేసేందుకు ముద్రించిన కరపత్రాలను అధికారులు చూపించగా, అందులో వాడిన భాషపై బెంచ్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాలపై మాత్రమే కనిపిస్తోందని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి బాగోలేదని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. నగరంలోని 427 ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉందని అధికారులు పేర్కొంటూ 30 రోజుల నివారణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని కోర్టుకు వివరించారు. ఆ సమయంలో బెంచ్ స్పందిస్తూ, విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకుని ఉంటే జనవరిలో 85గా ఉన్న డెంగ్యూ కేసులు అక్టోబర్ నాటికి 3,800లకు ఎలా పెరిగాయని అధికారులను ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, మూసి నది చూస్తే, పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని, ఒడ్డున ఉన్న హైకోర్టులోనే దోములు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తక్షణం సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, ఆ కమిటీ అధికారులు తీసుకున్న చర్యలపై ప్రతి గురువారం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఆ సమీక్ష నివేదికను కోర్టుకు సమర్పించాలని అన్నారు. దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు వెయ్యి ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణం ప్రభుత్వం మంజూరు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రభుత్వం విఫలమైతే, ఆ వ్యాధి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు బెంచ్ హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధి ప్రబలిన తీరుపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోట్ల రూపాయిలు ఖర్చు చేసి శిక్షణనిచ్చి, ఐఏఎస్‌లను తీర్చిదిద్దితే మీరు సామాన్యులకు ఏం సేవ చేస్తున్నారు’ అంటూ మండిపడింది. తెంలగాణ ఐఏఎస్‌లు ఈ దేశ పౌరులు కారా అంటూ సీజే ప్రశ్నించారు. ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్టు లేదని, పత్రికల్లో ప్రతిరోజూ ప్రతి పేజీలో వార్తలు వస్తున్నాయని సీజే వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను పాటించకుంటే సూమోటో కింద కేసులు నమోదు చేస్తామని ఐఏఎస్‌లను హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత ఖాతాల నుండి ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎస్ ఎస్‌కే జోషి, ఐఎఎస్‌లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, శాంతకుమారి, వైద్య శాఖ సంచాలకుడు రమేష్‌రెడ్డి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ , యోగితా రాణా వౌనంగా ఉండిపోయారు.