క్రైమ్/లీగల్

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ అరెస్టు, విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్, అక్టోబర్ 24: చెక్కు బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను అరెస్టుచేసిన పోలీసులు గురువారం కడప కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ద్వారకానగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త బి.మహేష్‌కుమార్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు 2014లో రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడు. తీసుకున్న అప్పుకు సంబంధించి గణేష్ రూ.8 లక్షలకు చెక్కు ఇచ్చారు. అయితే ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు హాజరుకావాలని గణేష్‌ను ఆదేశించినా ఆయన రాలేదు. దీంతో అరెస్టు వారెంట్ జారీ అయింది. గణేష్‌ను అరెస్టుచేసి కడప కోర్టులో హాజరుపరచాలని పోలీసులను మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు బండ్ల గణేష్‌ను బుధవారం అరెస్టు చేసి గురువారం కడప కోర్టు ఇన్‌చార్జి మెజిస్ట్రేట్ పవన్‌కుమార్ ఎదుట హాజరుపరచగా నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గణేష్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో పరిశీలించిన మెజిస్ట్రేట్ ఫిర్యాదుదారుడు మహేష్‌కుమార్‌కు రూ. 4 లక్షలు చెల్లిస్తే బెయిల్ మంజూరు చేస్తానని షరతు విధించ గా, అందుకు అంగీకరించి నగదు రూపంలో రూ.4 లక్షలు చెల్లించడంతో బెయిల్‌పై విడుదల చేశారు.