క్రైమ్/లీగల్

అనధికార బాణసంచా గోడౌన్లపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని బాణసంచా దుకాణాలు, అక్రమంగా నిల్వచేసిన గోడౌన్లపై పోలీసు అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 244 బాణసంచా తయారీ కేంద్రాలు, అక్రమంగా నిల్వచేసిన గోడౌన్లను సీజ్‌చేసి 105 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అత్యధికగా తూర్పు గోదావరి జిల్లాలో నిబంధనలు అతిక్రమించిన 53 యూనిట్లను, నెల్లూరులో ఒక యూనిట్‌ను సీజ్ చేశారు. అనుమతులు లేని 184 బాణసంచా తయారీ కేంద్రాలపైనా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ అనుమతులు ఉన్నా, లేకపోయినా బాణసంచా గోడౌన్‌లు, దుకాణాలు, జనావాసాల మధ్య పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదన్నారు. ప్రజల ధన, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశమున్న నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించవద్దని హెచ్చరించారు. జనావాసాల మధ్య బాణసంచా నిల్వ చేసే గోడౌన్‌లు, దుకాణాలు ఉంటే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు.