క్రైమ్/లీగల్

త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, అక్టోబర్ 25: శ్రీశైలంకు తూర్పు ముఖద్వారమైన త్రిపురాంతకంలో వెలసిన శ్రీత్రిపురాంతకేశ్వర బాలాత్రిపురసుందరీ దేవి అమ్మవారి ఆలయాల్లో గురువారం రాత్రి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. శ్రీత్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో పశ్చిమద్వారం నుంచి తాళాలు పగులకొట్టి దొంగలు లోనికి ప్రవేశించి పార్వతీదేవి అమ్మవారి పంచలోహ విగ్రహం, నటరాజ స్వామి విగ్రహాన్ని చోరీచేశారు. తూర్పు ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న హోంగార్డులు శ్రీను, వెంకటేశ్వరరెడ్డి ఎస్సై చంద్రావతికి సమాచారం ఇవ్వడంతో ఆమె ఆలయాన్ని పరిశీలించారు. ఈవిషయాన్ని మార్కాపురం డివైఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిఐ మారుతీకృష్ణకు తెలపడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను తెప్పించి ఆలయం చుట్టూ తిప్పారు. త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం సమీపంలో నటరాజస్వామి విగ్రహం పడి ఉండటంతో పరిశీలించి ఇవోకు అందచేశారు. తరచూ ఈ ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో డివైఎస్పీ నాగేశ్వరరెడ్డి స్పందిస్తూ గతంలో 2007, 2014లో ఇలాంటి దొంగతనాలు జరిగాయని, అప్పటి రికార్డులను పరిశీలించి త్వరగా దొంగలను పట్టుకోవాలని సిఐ మారుతీకృష్ణను ఆదేశించారు. సిసి కెమేరాలు లేకపోవడంతో దొంగతనాలకు అనువుగా ఉందని, హోంగార్డులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలన ఈసంఘటన జరిగిందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దొంగలను పట్టుకొని విగ్రహాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
.