క్రైమ్/లీగల్

వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పీ.జగదీశ్వర్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాతబస్తీ ఫలక్‌నుమా జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షబాజ్(25), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ రిజ్వాన్(22) స్నేహితులు. చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 18న మహ్మద్ షబాజ్, మహ్మద్ రిజ్వాన్.. కాటేదాన్‌లో ఎస్‌ఎంఏ ట్రాన్స్‌పోర్ట్ ఆవరణలో పార్కు చేసిన డీసీఎం (కేఏ 34 ఏ 0532)ను ఎవరూ లేని సమయంలో దొంగిలించారు. మార్చి నెల 26న ఇరువురు సికింద్రాబాద్‌లో పార్కు చేసిన ద్విచక్ర వాహనం షైన్ (టీఎస్ 10 ఈహెచ్ 1124) వాహనాన్ని చోరీ చేశారు. ఏప్రిల్ 6న పార్కు చేసిన డీసీఎం వాహనం (టీఎస్ 12యూఏ 6035)ను చోరీ చేసి వాటి విడి భాగాలను అమ్మి సొమ్ము చేసుకొని జల్సా చేశారు. కాగా సోమవారం ఉదయం అరాంఘర్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా తచ్చాడుతుంటే అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాలను వెల్లడించి చేసిన తప్పులను ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు డీసీఎంలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.