క్రైమ్/లీగల్

అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సమాజంలో అసమానతలు, అవినీతికి వ్యతిరేకంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వీలుగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ అవగాహన వారోత్సవం నిర్వహించనున్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రకటించింది. సమగ్రత, సంభావ్యత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొదించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ అవాగాహన వారోత్సవాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని, ముఖ్యంగా యువతలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని శుక్రవారం పేర్కొంది. మంచి నడవడిక, సమాజంలో అసమానతలు లేకుండా, అవినీతిరహిత పాలన ఉండేలా ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేసేందుకు వారోత్సవం దోహదపడుతుందని ఆశిస్తున్నామని తెలిపింది. అవినీతిని రూపుమాపేందుకు కేవలం చట్టాలు చేయడంతో సరిపోదని, అందుకు అనుగుణంగా ప్రజల్లోనూ చైతన్యవంతం రావాల్సి ఉందని పేర్కొంది. మానవ విలువలు, నైతికత విలువలు పెంపొదించడం అవసరం అని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలన్నీ తమ శాఖల్లో అవగాహన సదస్సులు, వారోత్సవాలు నిర్వహించి సమాజంలో అవినీతిని పారదోలడం, నైతిక విలువలు పెంపొదిస్తూ నవ భారత నిర్మాణానికి చేయూతను అందించాలని ఉద్యోగులను కోరాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచించింది. ఈ సందర్భంగా ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకం గా ప్రతిజ్ఞ చేయించాలని కోరింది. ఈ మేరకు అవసరమైన కరపత్రాలను అందించాలని తెలిపింది. అవినీతిని అరికట్టే విషయంపై విద్యార్థులకు వ్యాస రచన, వౌఖిక పరీక్షలు నిర్వహించి వారిలోనూ అవగాహన కల్పించాలని సూచించింది. ఇంకా క్విజ్, చర్చా వేదికలునిర్వహించాలని తెలిపింది.