క్రైమ్/లీగల్

ఫ్లాట్ ఓనర్లకు రూ. 25 లక్షలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కోస్టర్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ‘మరడు’ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టమైన తీర్పును వెలువరించింది. పర్యావరణాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు గతంలోనే అపార్ట్‌మెంట్‌లను కూల్చివేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఎస్ రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఫ్లాట్ యజమానులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నెల రోజుల్లోపు20 కోట్ల రూపాయలు చెల్లించాలని బిల్డర్లకు కోర్టు సూచించింది. న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ వద్ద డిపాజిట్ చేయాలని మరడు బిల్డర్లను బెంచ్ ఆదేశించింది. రూ. 20 కోట్లు నెల రోజుల్లో డిపాజిట్ చేయకపోతే బిల్డర్ల బ్యాంక్ ఖాతాలు అటాచ్ చేస్తామని కోర్టు హెచ్చరించింది. అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు ఓ అఫిడివిట్‌తో కలిపి కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు చెప్పారు. కాగా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కూల్చివేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిర్మాణాలు కూల్చకుంటా వేరొక అవసరాల కోసం వాటిని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) చేసిన సూచనను ధర్మాసనం తోసిపుచ్చింది.‘ మరడు అపార్ట్‌మెంట్స్ కూల్చివేయాలన్న మా ఆదేశాలను వెనక్కి తీసుకోబోం. దానిపై ఆందోళన అనవసరం. మా ఆదేశాలకు తిరుగులేదు. అమలు చేయాల్సిందే’అని సుప్రీం స్పష్టం చేసింది. బిల్డర్లకు ఫ్లాట్ యజమానులు ఎంతెంత చెల్లించారో డాక్యుమెంట్ ఆధారాలు సేకరించాలని కోర్టు నియమించిన ఏక సభ్య కమిటీని బెంచ్ ఆదేశించింది. కొందరు కొనుగోలుదారులు తాము 25 లక్షల రూపాయలకంటే ఎక్కువే బిల్డర్లకు చెల్లించామని కోర్టు దృష్టికి తీసుకురాగా బెంచ్ స్పందించింది.

దీనిపై పూర్తి వివరాలు అందించాలని సంబంధిత న్యాయవాదికి సూచించింది. కాగా ఫ్లాట్ యజమానులకు తాత్కాలిక పరిహారం కింద ఇప్పటికే 10 కోట్ల రూపాయలు చెల్లించినట్టు కేరళ ప్రభుత్వం బెంచ్‌కు తెలిపింది. తమను అపార్ట్‌మెంట్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, నిర్మాణాలు కూల్చివేయాలన్న ఆదేశాలపై స్టే మంజూరు చేయాలని సెప్టెంబర్ 30 ఫ్లాట్ యజమానులందరూ సుప్రీంను ఆశ్రయించి భంగపడ్డారు. తమ ఆదేశాలు వెనక్కి తీసుకునేది లేదని ధర్మాసనం విస్పష్టంగా ప్రకటించింది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను 138 రోజుల్లో కూల్చేయాలని, ఫ్లాట్ యజమానులకు 25 లక్షల రూపాయలు నాలుగు వారాల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.