క్రైమ్/లీగల్

రవిప్రకాష్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌కు హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. వ్యక్తిగత బాండుతో పాంటు 15 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. టీవీ-9 సీఈఓగా ఉన్న సమయంలో రవిప్రకాష్ తన స్వప్రయోజనాల కోసం నిధులను మళ్లించుకున్నారనే అభియోగాలతో పోలీసులు అరెస్టుల చేశారు. ఆయనను కస్టడీకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆయన చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేసి రవిప్రకాష్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపై విచారణ కొనసాగుతున్న దశలోనే హైకోర్టు రవిప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేసింది.