క్రైమ్/లీగల్

రికార్డులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: హైకోర్టు సమ్మె అంశంతో పాటు జీతాల చెల్లింపు, అద్దె బస్సుల కొనుగోలు అంశంపై దాఖలైన మూడు పిటిషన్లపై సోమవారం నాడు హైకోర్టు విచారణ కొనసాగించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తదుపరి మంగళవారం మధ్యాహ్నం విచారణ కొనసాగించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన కమిటీ నివేదిక, చర్చల సారాంశంతో కూడిన కౌంటర్‌ను ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచింది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద పది కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, సమ్మె కారణంగా రోజూ పది కోట్లు నష్టం వస్తోందని, ఈ దశలో కార్మికుల డిమండ్లను పరిష్కరించడం ఆర్థికభారంతో కూడుకున్నవని అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు పేర్కొన్నారు. మరికొన్ని డిమాండ్లు రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధమైనవని, నాలుగైదు డిమాండ్లు పరిష్కరించదగినవని, చర్చలు జరుగుతుండగా, కార్మిక నాయకులు తమంతట తామే
వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దశలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరికాదని, రాష్ట్ర ప్రభుత్వమే అనేక రూపాల్లో ఆర్టీసీకి బకాయి ఉందని కార్మికుల తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ 1,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, రీయింబర్స్‌మెంట్, ఇతర బకాయిలు కలిపి దాదాపు 4,967 కోట్లు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ బకాయిలు నిజమేనా? అని ప్రధాన న్యాయమూర్తి అప్పటికే న్యాయస్థానానికి హాజరైన అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించారు. దీనిపై తమ వద్ద సమాచారం లేదని తెలుసుకుని రెండు రోజుల్లో చెబుతామని పేర్కొనగా, అంత గడువు ఇవ్వలేమని, మంగళవారం మధ్యాహ్నం ఆ వివరాలతో కోర్టు ముందు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. రాత్రికి రాత్రే అన్ని సమస్యలూ పరిష్కారం కావని, అందుకే తాము సాధ్యమైన అంశాలపై ముందుగా చర్చలు ప్రారంభించాలని సూచించామని హైకోర్టు వ్యాఖ్యానించగా, తమ డిమాండ్లను అంగీకరించడంపై తాము పట్టుపట్టడం లేదని, ముందు చర్చలు జరగాలని కోరుకుంటున్నామని కార్మికుల తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యయనం చేసి ఆర్టీసీ ఎండీకి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరఫున ఏఏజీ కోర్టుకు చెప్పారు. 21 డిమాండ్లలో 16 ఆర్థిక అంశాలేనని, ప్రస్తుతానికి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని చెప్పారు. మరో రెండు అంశాలకు పెద్ద ఎత్తున నిధులు కావాలని అన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఈడీల కమిటీ నివేదికను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. నివేదికలు తమ వద్ద కూడా దాచిపెడతారా? అని ప్రశ్నించింది. పూర్తిస్థాయి ఎండీని ఇంతవరకూ ఎందుకు నియమించలేదని నిలదీసింది.
డిమాండ్లు అంగీకరించడం సాధ్యం కాదని ముందే ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఎలా? అలా నిర్ణయించుకున్న తర్వాత కార్మికులను చర్చలకు పిలిస్తే లాభం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల కంటే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. 21 డిమాండ్లలో నాలుగింటిని పరిష్కరించాలంటే 46.2 కోట్ల రూపాయలు అవసరమని నివేదికలో పేర్కొన్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆర్టీసీకి 50 కోట్లు ఇవ్వగలదా? అని కోర్టు ప్రశ్నించింది. 50 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఏఏజీ పేర్కొనగా, తక్షణమే ఏజీని పిలవాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ ఆదేశించింది. దీంతో ఏజీ బీఎస్ ప్రసాద్ బెంచ్ ముందు హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తోందని, 47 కోట్లు ఇవ్వలేదా? అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి కోర్టుకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. దాంతో ఏజీకి ఇబ్బందిగా ఉంటే సీఎస్‌నూ, ఆర్థిక శాఖ కార్యదర్శిని కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.