క్రైమ్/లీగల్

మహేశ్వరంలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, అక్టోబర్ 26. మహేశ్వరం అగ్నిమాపకసేవల కేంద్రంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి దీపావళి సందర్బాంగా తాత్కాలిక టాపాకాయల దుకాణాల కోసం దరఖాస్ చేసుకున్న చిరువ్యాపారుల నుండి లంచం డిమాండ్ చేసిన లీడింగ్ ఫైర్‌మెన్ గురువయ్యను అరెస్టు చేసి ఎ సి బి కోర్టుకు తరలించారు. అవినీతినిరోధక శాఖ డీఎస్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ మహేశ్వరం అగ్నిమాపకసేవల కేంద్రం పరిధిలోని మహేశ్వరం, కందుకూర్,కడ్తాల్ మండలాలకు చెందిన 43 మంది చిరువ్యాపారులు దీపావళి పర్వదినం సందర్బాంగా టపాకాయలు విక్రయించడానికి దరఖాస్తుచేసుకోగా ఎన్‌ఓసి ఇవ్వడానికి లీడింగ్ ఫైర్‌మైన్ ఎం.గురువయ్య ఒక్కొక్కరినుండి రెండు, మూడువేలు డిమాండ్ చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. తుమ్మాలూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని కూడా డబ్బులు డిమాండ్ చేయగా తమకు ఫిర్యాదు చేయడంతో ఆకస్మిక సోదాలు నిర్వహించామని ఫిర్యాదు చేసిన దుర్గాప్రసాద్ కూడా ఈ రోజు 15 వందలు లంచం ఇచ్చి ఎన్‌ఓసి తీసుకున్నట్లు రుజువు కావడంతో లీడింగ్ ఫైర్‌మెన్ గురువయ్య పై అవినీతి కేసులు నమోదు చేసి ఏసీబీ కోర్టులోహాజరుపరుస్తామని న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో టపాకాయల దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోనేవారు ఎవరు లంచం అడిగినా తమకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ఏసీబీ సోదాల్లో సీఐలు గంగాధర్, మజీద్‌అలీఖాన్, నాగేంద్రబాబు, రామలింగారెడ్డి,సిబ్బంది పాల్గ్గొన్నారు. డీఎస్సీ సూర్యనాయరాణ ఫోన్ నెంబర్ 9440446140కు సమాచారం అందించాలని కోరారు.