క్రైమ్/లీగల్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో :ముగ్గురు మహిళలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 26:ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి ఉప్పుగుండూరు వెళ్ళే మార్గంలో గొల్లవానికుంట జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన 14మంది మహిళలు ఒంగోలు మార్కెట్‌లో చేపలు విక్రయించేందుకు ఆటోలో బయలుదేరారు. గొల్లవానికుంట వద్ద రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆటో ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలోని 14మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా ఎన్ అక్కనాగమ్మ (45) మార్గమధ్యంలోనే మృతిచెందగా గోవిందమ్మ (43), చెంచమ్మ (41) ఆసుపత్రి చికిత్స పొందుతూ చెందారు. డ్రైవర్ సహా మిగిలిన వారికి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
ప్రాణం తీసిన ఈత సరదా
ఇదిలావుండగా పొదిలి మండలం మూసివాగులో ఈతకోసం వెళ్ళి ఇద్దరు విద్యార్ధులు తమ ప్రాణాలను పొగోట్టుకున్నారు. పొదిలి మండలం ఏలూరిపంచాయతీ పరిధిలోని కల్లూరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిహెచ్ బ్రహ్మారెడ్డి, ఇండ్లా సూర్య అనే 11 ఏళ్ల విద్యార్థులు సరదగా మూసివాగు వద్దకు ఈతకోసం వెళ్ళారు. అయితే ప్రమాదవశాత్తు వారిద్దరు వాగులో మునిగిపోయారు. దీపావళి పండగకు తమ పిల్లల్ని ఇంటికి పిలుద్దామని హాస్టల్‌కు వెళ్లగా మీ అబ్బాయిలు మూడురోజుల కిందటే ఇంటికి వెళ్లి ఇప్పటివరకు రాలేదని చెప్పడంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చుట్టుపక్కల గాలించగా మూసి వాగువద్ద పిల్లల బట్టలు, చెప్పులు కన్పించాయి. విషయాన్ని పోలీసులకు సమాచారం చేరవేయగా వారు రంగంలోకి దిగి వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో ఒక మృతదేహం కన్పించింది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
*చిత్రం...నాగులుప్పలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యం