క్రైమ్/లీగల్

మహిళా కండక్టర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో మనోవేదనకు గురై సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కొమరబత్తిని నీరజ (31) సోమవారం ఉదయం ఖమ్మం నగరంలోని తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత 23రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఆమె ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం గ్రామంలోని తన తల్లివద్దకు వెళ్ళి వచ్చి సోమవారం ఉదయం ధర్నాకు వెళ్తున్నానని భర్తకు చెప్పింది. గ్రానైట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న భర్త భీమిలి రాజశేఖర్ విధులకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గత 8 సంవత్సరాలుగా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కుటుంబం గడవడం కష్టంగా మారిందని, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని ఆమె బాధపడుత్నునట్లు భర్త రాజశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వ వ్యవహార శైలివల్లనే తాను తన భార్యను పోగొట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నీరజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన కార్మికులు ఆగ్రహానికి లోనై ఆందోళనకు దిగారు. నీరజ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా కలెక్టరేట్ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. అఖిలపక్షం కూడా మద్దతు తెలపడంతో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట కూడా జరిగింది. చివరకు జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే నీరజ మృతికి ప్రభుత్వమే కారణమంటూ ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో కార్మికులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వరుసగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం దారుణమని నినాదాలు చేశారు. కాగా ఖమ్మం నగరానికి చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఇటీవల వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకోగా, తాజాగా నీరజ ఆత్మహత్యతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇలాఉంటే అన్ని రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు తెలపడంతో తాత్కాలిక డ్రైవర్లతో కూడా స్వల్పంగానే బస్సులు తిరిగాయి.

* కొమరబత్తిని నీరజ (ఫైల్‌ఫొటో )