క్రైమ్/లీగల్

బ్రేకులు ఫెయిలై.. ఆర్టీసీ బస్సు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 28: హబ్సిగూడ చౌరస్తాలో సోమవారం ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై ముందు వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అదే ప్రాంతంలో ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. వాహనాలపై ఉన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. జనగామ డిపోకు చెందిన బస్సు జేబీఎస్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉండగా కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్‌ఐ హరీశ్వర్ రెడ్డి తెలిపారు.