క్రైమ్/లీగల్

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, అక్టోబర్ 28: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కధనం ప్రకారం.. మండల పరిధిలోని కొల్తూరు గ్రామానికి చెందిన ములుగు హారిక అదే గ్రామానికి చెందిన ప్రవీన్‌ను గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు ప్రేమించుకొని ఈనెల 25న ఇంట్లో నుండి పారిపోయి ఈ ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు తన కూతురు మనస్సును మార్చే ప్రయత్నం చేశారు. చివరికి విఫలం కావడంతో హారిక తల్లి అనిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని శుక్రవారం నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో 90 శాతం కాలిన అనితను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు గ్రామాన్ని సందర్శించి కేసు పుర్వపరాలు తెలుసుకున్నారు. కొల్తూరు గ్రామంలో జరిగిన సంఘటన పట్ల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్త చేశారు.