క్రైమ్/లీగల్

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, అక్టోబర్ 28: గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామ సమీపంలోని కృష్ణవేణి చక్కెర పరిశ్రమ వద్ద గుర్తు తెలియని మహిళ సుమారు 25 ఏళ్ల మహిళను ఎక్కడో చంపి చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. 44వ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పంట పొలాల వద్ద మహిళ శవాన్ని గుర్తించారు. ఆ మహిళకు చేతికి గాజులు, తాళి, కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. శవం పూర్తిగా కాలిపోవడంతో గుర్తు పట్టని విధంగా ఉండడంతో క్లూస్ టీమ్‌ను పిలిచి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గద్వాల నుండి వచ్చిన డ్వ్యాగ్స్ స్వ్యాడ్స్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అప్పరాల గ్రామం వరకు వెళ్లి ఆగిపోయాయి. సంఘటన స్థలాన్ని సీ ఐ వెంకటేశ్వర్‌రావు, వనపర్తి డీఎస్పీ సృజన పరిశీలించారు. శవం పూర్తిగా కాలిపోవడంతో డాక్టర్లను పిలిచి అక్కడే పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. మహిళ ఎవ్వరైనా తప్పిపోయినట్లు ఉంటే 9440795727కు సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.