క్రైమ్/లీగల్

గిరిజన గురుకుల పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినుల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, అక్టోబర్ 28: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలో గల గిరిజన గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులులు శనివారం రాత్రి వసతి గృహం నుండి వెళ్లి పోయిన సంఘటన చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థినులు 9వ తరగతి ఏ, బీ సెక్షన్‌లలో విద్యనభ్యసిస్తున్నారని, ఆదివారం సాయంత్రం వరకు వసతి గృహంలో లేకపోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు కల్వకుర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ప్రిన్సిపాల్ విజయ్‌రాంరెడ్డి తెలిపారు.
గురుకుల పాఠశాల నుంచి వెళ్లిన వారు సుజాత బల్మూర్ మండల బిల్లకల్ గ్రామం, నాగేశ్వరి లింగాల మండలం రాంపూర్‌పెంట, రాజేశ్వరి అమ్రాబాద్ మండల కేంద్రానికి, పావని అచ్చంపేట మండలం మాచారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించినట్టు ఎస్సై నర్సింహులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.