క్రైమ్/లీగల్

నెల్లూరులో అగ్నిప్రమాదం: సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తినష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 28: దీపావళి వేళ నెల్లూరు నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. నగరంలోని చిన్నబజార్‌లో అశోక్‌సింగ్ అనే వ్యక్తి శ్రీకనకదుర్గ మెటల్ స్టోర్ పేరుతో వ్యవసాయ, ఆక్వా సంబంధిత ప్లాస్టిక్ సామగ్రిని విక్రయిస్తుంటాడు. ఆదివారం రాత్రి దీపావళి సందర్భంగా బజార్‌లో అందరూ బాణసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పురవ్వలు భవన మూడో అంతస్తుపై ఉంచిన థర్మాకోల్ షీట్లపై పడడంతో నిప్పంటుకుంది. మేడ పై భాగం కావడంతో ఎవరూ గమనించలేదు. మంటలు తీవ్రస్థాయికి చేరుకొని కింది అంతస్తుల్లోకి ప్రవేశించాయి. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో ఇంట్లోని వారందరూ బయటకు పరుగులు తీశారు. ఈ మూడంతస్తుల భవంతిలోనే గోదాము, ఇల్లు రెండూ ఉన్నాయి. రాత్రి 10 గంటలకు మొదలైన ఈ మంటలు తెల్లవారుజాము 3 వరకూ కొనసాగాయి. నెల్లూరు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.