క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అవినీతి నిరోధక శాఖాధికారులకు ఓ అవినీతి తిమింగలం పట్టుబడింది. అక్షరాలా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ రంగబాబు ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 2020 క్యాలెండర్లు, డైరీల ముద్రణ విషయంలో సీఈఓ రంగబాబు ఈ మొత్తాన్ని లంచం రూపంలో డిమాండ్ చేసి తీసుకుంటూ పట్టుబడ్డారని ఏసీబీ విజయవాడ రీజియన్ అదనపు ఎస్పీ సోమంచి సాయికృష్ణ విలేఖరులకు తెలిపారు. పట్టణానికి చెందిన హనుమాన్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచారయ్య కేడీసీసీ బ్యాంక్‌కు 2020 క్యాలెండర్లు, డైరీలను రూ. 7లక్షల 58వేల 200ల కొటేషన్‌తో ముద్రించేందుకు ముందుకొచ్చాడు. ఇందుకు సంబంధించి వర్క్ ఆర్డర్‌తో పాటు ఏడాది పాటు కేడీసీసీ బ్యాంక్‌కు సంబంధించిన ఏ వర్క్ అయినా నాంచారయ్యకు ఇచ్చేందుకు సీఈఓ రంగబాబు రూ. 5లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ముందుగా క్యాలెండర్లు, డైరీల ముద్రణకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్
చేశాడు. దీంతో బాధితుడు చేసేదిలేక అందుకు అంగీకరించాడు. తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పగా వారి సూచనల మేరకు సీఈఓకు లక్ష రూపాయలు లంచం ఇచ్చాడు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం కేడీసీసీబీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రంగబాబును పట్టుకున్నారు. లక్ష రూపాయల నగదును సీజ్ చేయటంతో పాటు సీఈఓపై కేసు నమోదు చేశామని, విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ ఏఎస్పీ సాయికృష్ణ విలేఖరులకు వివరించారు.
*చిత్రం...ఏసీబీకి పట్టుబడిన సీఈఓ రంగబాబు